News January 1, 2026
ఎర్రవల్లి ఫామ్ హౌస్, నందినగర్ నివాసానికి లేఖలు

సిద్దిపేట జిల్లాలోని మల్లన్న సాగర్ ముంపు గ్రామాల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ బాధితులు మాజీ సీఎం కేసీఆర్‌కు లేఖలు పంపారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్, నందినగర్ నివాసాలకు స్పీడ్ పోస్ట్ ద్వారా వీటిని పంపారు. రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తమ భూమి, నివాస, పునరావాస సమస్యలపై చర్చించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ గోడును సభ దృష్టికి తీసుకెళ్లాలని బాధితులు కోరారు.
Similar News
News January 1, 2026
HYDలో కొత్త ట్రెండ్.. ఇదే బెస్ట్ స్పాట్..!

HYDలో ఏ వేడుక జరిగినా ఇప్పుడు అందరి చూపు డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సెక్రటేరియట్ వైపే ఉంటోంది. IPLలో RCB విజయం, న్యూ ఇయర్ వేడుకలను సీపీ సజ్జనార్ ఇక్కడే జరుపుకోవటం విశేషం. సెక్రటేరియట్ అద్భుతమైన నిర్మాణ శైలి, విద్యుత్ వెలుగులతో ఈ ప్రాంతం పర్యాటకానికి ‘బెస్ట్ స్పాట్’గా మారింది. అమరజ్యోతి, భారీ అంబేడ్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.
News January 1, 2026
శాతవాహన మహిళా సెల్ డైరెక్టర్‌గా డా.నమ్రత

శాతవాహన విశ్వవిద్యాలయ మహిళా సెల్ డైరెక్టర్గా రసాయన శాస్త్ర సహా ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ వి.నమ్రతకు VC ఆచార్య ఉమేష్ కుమార్ ఉత్తర్వులు అందజేశారు. డా.నమ్రత 2008లో సహాయ ఆచార్యులుగా రసాయన శాస్త్ర విభాగం సైన్స్ కళాశాలలో నియామకం పొంది ఆ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. డా.నమ్రత మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో మహిళా అధ్యాపకుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు.