News December 6, 2025
ఎర్రవల్లి: వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచి అభ్యర్థులు ఆయన్ను కలిశారు. వచ్చేది మన ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కొన్ని కష్టాలు వచ్చినా బెదరకూడదని అన్నారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు.
Similar News
News March 10, 2026
HYD: అర్ధరాత్రి సందడే.. సందడి!

రంజాన్ పండుగ సమీపిస్తున్న తరుణంలో HYDలో పది రోజుల పాటు సందడి నెలకొననుంది. చార్మినార్, టోలిచౌకి, పాతబస్తీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నైట్ బజార్లకు నగర నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుండటంతో అర్ధరాత్రి వేళ కూడా ఆ వీధులన్నీ షాపింగ్ ప్రియులతో కళకళలాడుతున్నాయి. పాతబస్తీలో వ్యాపారాలు జోరందుకోగా, పెరిగిన వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు.
News March 10, 2026
రాత్రి మంచి నిద్ర కోసం..

రాత్రి వేళ చక్కటి నిద్ర కోసం ఆహారంలో అరటిపండు, పిస్తా, బార్లీ, పాలు, పెరుగు, గుడ్డు తెల్లసొన, గుమ్మడి విత్తనాలు భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక కొంతమంది రాత్రి మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని భావిస్తారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుందన్నారు.
Share It
News March 10, 2026
యుద్ధం సెగ.. పాక్ కఠిన నిర్ణయాలు

ఇరాన్ యుద్ధం సెగ పాక్‌కు గట్టిగానే తగులుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోత విధించింది. 60% వాహనాలను నడపొద్దని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత పెట్టింది. ఆఫీసులను వారానికి 4 రోజులు మాత్రమే తెరవనుంది. స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని సూచించింది.


