News April 13, 2026
ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంలో మన HYD TOP

దేశవ్యాప్తంగా ఈవీ వినియోగంలో హైదరాబాద్ మహానగరం 14% వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ- విటారా వాహనాలను ఇటీవలే భారీగా కొనుగోలు చేశారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉండటంపై మరింత ఫోకస్ చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News April 13, 2026
గద్వాల: జిల్లా పోలీస్ ప్రజావాణికి 10 ఫిర్యాదులు

గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ టి. శ్రీనివాసరావు బాధితుల నుంచి 10 ఫిర్యాదులను స్వీకరించారు. భూ వివాదాలు, వేధింపులు వంటి సమస్యలపై విచారణకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి పర్యవేక్షిస్తున్నామని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
News April 13, 2026
ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కుమార్

రంపచోడవరం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అవసరమైన సిబ్బంది కేటాయింపులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా పీఎం జన్మన్ గృహాల నిర్మాణం, సోలార్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
News April 13, 2026
MDK: రాత్రికి నీటి విడుదల.. ప్రజలు జాగ్రత్త

ఇవాళ రాత్రి 8 గంటల నుంచి మంజీరా బ్యారేజ్ నుంచి ఘనపూర్ ఆనికట్‌కు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. సెకనుకు 1,070 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే సునీతా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా విజ్ఞప్తి చేశారు. నదీ ప్రవాహానికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


