News March 24, 2024
ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలు పాటించాలి:కలెక్టర్

సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలక్టరేట్‌లో ఎలక్షన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కో ఆర్డినేషన్ సెక్షన్, లీగల్ సెల్, మీడియా సర్టిఫికేట్ అండ్ మానిటరింగ్ కమిటీ విభాగం, సువిధ పోర్టల్ విభాగాన్ని అందుబాటులో ఉంచారు. జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం పరిశీలించి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల విధులు గురించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు.
Similar News
News February 8, 2026
GNT: వెహికల్ చెకింగ్.. రూ.5లక్షల జరిమానా, 72 సీజ్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పోలీసులు రహదారి భద్రతా డ్రైవ్ చేపట్టారు. మొత్తం 2,436 వాహనాలను ప్రధాన కూడళ్లల్లో తనిఖీ చేశారు. త్రిపుల్ రైడింగ్, అతివేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణం, మైనర్ల డ్రైవింగ్‌ని గుర్తించి
933 వాహనాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు రూ.5,67,590 జరిమానా విధించారు. ధృవపత్రాలు సక్రమంగా లేని 72 వాహనాలను సీజ్ చేశారు.
News February 8, 2026
GNT: రేపు ఎస్పీ ఆఫీసులో PGRS రద్దు

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాటి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్‌ను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు గమనించాలని చెప్పారు.
News February 8, 2026
రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలు: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగే పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ సేవలను ప్రజలు సద్వినియోగంచేసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. https://Meekosam.ap.gov.inవెబ్ సైట్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చని, డయల్ 1100కి ఫోన్ చేసి అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. మండలాల వారీగా రెవెన్యూ క్లీనిక్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. అక్కడ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చన్నారు.


