News January 10, 2026

ఎలమంచిలి: అనారోగ్య సమస్యలతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ

image

ఎలమంచిలి మున్సిపాలిటీ కోర్టు వీధిలో అనారోగ్య సమస్యలతో మేడిశెట్టి రాధిక(40) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న ఆమె డాబా పైకి వెళ్లి 5 బాటిళ్ల పెట్రోల్ శరీరంపై పోసుకుని నిప్పు అంటించుకున్నారు. రాధిక భర్త పెద్దపల్లి సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పట్టణ ఎస్ఐ సావిత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 4, 2026

MGU: బ్యాక్‌లాగ్ విద్యార్థులకు ‘చివరి అవకాశం’

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో 2011-12 నుంచి 2015-16 వరకు చదివిన బ్యాక్‌లాగ్ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు చివరి అవకాశం కల్పించారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 4 వరకు, రూ.100 ఆలస్య రుసుముతో మార్చి 6 వరకు ఫీజు చెల్లించవచ్చని ఎగ్జామినేషన్ కంట్రోలర్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ బ్యాక్‌లాగ్ విద్యార్థులు తమ పెండింగ్ పేపర్లు క్లియర్ చేసుకునేందుకు ఇది మంచి అవకాశమన్నారు.

News February 4, 2026

మహబూబ్‌నగర్: అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులపై అవగాహన సదస్సు

image

మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించనున్నట్లు కమిషనర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ కళాభవనంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా హాజరుకావాలని, ప్రచార ఖర్చుల వివరాల నమోదుపై కీలక సూచనలు చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

News February 4, 2026

గుంటూరు జిల్లాలో ర్యాలీలు, సభలు నిషేధం: ఎస్పీ

image

గుంటూరు జిల్లాలో ప్రస్తుతం పోలీస్ యాక్ట్-30 అమలులో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.