News April 7, 2025

ఎలమంచిలి: నువ్వులో కొత్త వంగడాన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు

image

ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కొత్త నువ్వు వంగడం వైఎల్ఎల్-149 ను రూపొందించారు. కేంద్ర విత్తన ఎంపిక కమిటీ ఈ వంగడం విడుదలకు ఆమోదం తెలిపినట్లు స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్త శిరీష ఆదివారం తెలిపారు. కొత్త నువ్వు వంగడం ఎకరానికి ఐదారు క్వింటాళ్ల అధిక దిగుబడి ఇస్తుందని ప్రయోగాత్మక సాగులో నిర్ధారణ అయిందన్నారు. విత్తిన 80 నుంచి 85 రోజుల్లో పంట కోతకు వస్తుందని అన్నారు.

Similar News

News April 9, 2025

సంగారెడ్డి: 332 మొబైల్ ఫోన్లు రికవరీ: ఎస్పీ

image

CEIR ద్వారా ఫిర్యాదు వచ్చిన 332 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా బుధవారం నిర్వహించారు. CEIR పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి 9,878 ఫిర్యాదులు రాగా 2,150 ఫోన్లను గుర్తించి బాధితులకు అందించినట్లు చెప్పారు. 15 రోజుల క్రితం ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ద్వారా మూడో నెల 32 ఫోన్ లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.

News April 9, 2025

సీతారాముల వారి కళ్యాణానికి పటిష్ట బందోబస్తు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11న శుక్రవారం నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. 2 వేలకు మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తు విధుల్లో నలుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది పోలీసు సిబ్బంది ఉంటారన్నారు.

News April 9, 2025

చంద్రగిరిలో మైనర్ బాలిక పరువు హత్య..?

image

చంద్రగిరి(M) నరసింగాపురంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నిఖిత(17)ను శుక్రవారం కన్న తల్లిదండ్రులే చంపి కననం చేసినట్లు సమాచారం. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణం అని తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!