News December 20, 2025
ఎలా మాట్లాడాలంటే?

ఇతరులతో మాట్లాడేటప్పుడు వ్యక్తిగత విషయాలను తీసుకురాకూడదంటున్నారు నిపుణులు. అలాగే ఏదైనా అంశాన్ని నిరూపించడానికి ఎక్కువ వాదించకూడదు. చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా చెప్పాలి. వివిధ అంశాల గురించి పైపైన టచ్ చేస్తూ చెప్పడం కంటే ఒక్క అంశాన్నే స్పష్టంగా వివరించడం మంచిది. చెప్పే సమయం కంటే, నాణ్యతకే ప్రాధాన్యమివ్వాలి. కాబట్టి ఏ విషయాన్నైనా స్పష్టంగా, నాణ్యతతో తక్కువ సమయంలోనే చెప్పడానికి ప్రయత్నించాలి.
Similar News
News December 20, 2025
₹3Cr కోసం తండ్రిని పాముకాటుతో చంపించి..

పున్నామ నరకం నుంచి తప్పించేవాడు కొడుకనేది ఒకప్పటి మాట. మానవత్వం మరిచి ఆస్తుల కోసం తండ్రిని చంపేసే కొడుకులున్న కలికాలం ఇది. ఇలాంటి ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగింది. తండ్రి గణేశన్(56) పేరుపై ₹3Cr బీమా చేయించి పాము కాటుతో చంపారు దుర్మార్గపు కొడుకులు. OCTలో ఈ ఘటన జరగగా బీమా సంస్థ అనుమానంతో అసలు విషయం బయటికొచ్చింది. ప్రస్తుతం వీరు నోట్లకు బదులు జైలు ఊచలు లెక్కబెడుతున్నారు.
News December 20, 2025
Unbelievable: ఈ వెజిటెబుల్ కేజీ రూ.లక్ష

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కూరల్లో హాప్ షూట్స్ ఒకటి. భారత మార్కెట్‌లో కేజీ రూ.85వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. వీటిలోని హ్యుములోన్, లుపులోన్ యాసిడ్స్ క్యాన్సర్ సెల్స్‌తో పోరాడుతాయని సైంటిస్టులు చెబుతారు. TB వంటి సీరియస్ వ్యాధుల చికిత్సకూ ఉపయోగిస్తారు. బిహార్, HPలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. వందల హాప్ షూట్స్ కలిస్తేనే కేజీ వరకు తూగడం, పండించడంలో సవాళ్లు, కోతలో కష్టమూ భారీ ధరకు కారణాలు.
News December 20, 2025
అభివృద్ధి చిరునామా ORR.. ఇప్పుడు అమరావతి వంతు!

HYD అభివృద్ధిలో ఔటర్ రింగ్ రోడ్(ORR)ది కీలక పాత్ర. కనెక్టివిటీ పెరగడంతో నివాస, వాణిజ్య సముదాయాలు పెరిగాయి. ఇప్పుడు నూతనంగా ఎదుగుతున్న AP <<18624817>>రాజధాని<<>> అమరావతి ORRకు అడుగులు పడుతున్నాయి. ఇది పూర్తయితే 5 జిల్లాల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్‌కు ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. అయితే భూసేకరణకు ప్రజల సహకారం ఎలా ఉంటుంది? ఎప్పటికి పూర్తవుతుందనేదే ప్రశ్న!


