News December 16, 2025
ఎలుకల నియంత్రణకు ఇనుప తీగల ఉచ్చు

ఎలుకల నివారణకు ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఇనుప తీగలు, వెదురు, తాటాకులతో తయారు చేసిన బుట్టలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఎలుకలను ఆకర్షించడానికి వాటిలో ఉల్లిపాయలు, టమాట, ఎండుచేపలు, బజ్జీలు లాంటివి ఉంచాలి. వీటిని పొలం గట్ల వెంబడి, గోదాముల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వరిలో నారుమడి పోసిన దగ్గర నుంచి దమ్ములు పూర్తై నాట్లు వేసిన నెల వరకు.. కోతల తర్వాత ఏర్పాటు చేస్తే ఎలుకలను సమర్థంగా నివారించవచ్చు.
Similar News
News February 17, 2026
దేవుడిపైనే భారం: మిచెల్ మార్ష్

శ్రీలంకతో కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా <<19162360>>ఓడిపోవడం<<>>పై ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించారు. ‘మంచి స్టార్టింగ్ వచ్చినా కొన్ని పరుగులు తక్కువ చేశాం. కానీ స్కోరును డిఫెండ్ చేసుకోవచ్చని అనుకున్నాం. శ్రీలంక బాగా ఆడింది. ఇక దేవుడిపైనే భారం. జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్‌ను ఆశతో చూస్తాం. ప్రస్తుతం నిరాశలో ఉన్నాం’ అని మ్యాచ్ అనంతరం చెప్పారు. జింబాబ్వే గెలుపోటములపైనే ఆసీస్ S-8 అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
News February 17, 2026
ఫిబ్రవరి 17: చరిత్రలో ఈరోజు

1883: స్వాతంత్ర్య సమరయోధుడు వాసుదేవ బల్వంత ఫడ్కే మరణం
1954: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జననం
1963: అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్ జననం
1983: సినీ రచయిత పాలగుమ్మి పద్మరాజు మరణం
1984: క్రికెట్ ప్లేయర్ డివిలియర్స్ జననం
1984: సినీ నటి సదా జననం
1986: తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి మరణం
2000: మైక్రోసాఫ్ట్ విండోస్ 2000 ఓఎస్ విడుదల
News February 17, 2026
పాక్‌లో ‘Money Heist’.. 700 తులాల బంగారం చోరీ!

పాకిస్థాన్‌లోని కరాచీలో ‘మనీ హీస్ట్’ తరహా భారీ చోరీ జరిగింది. ఓ ఆభరణాల దుకాణంలో 300 మిలియన్ల PKR విలువైన బంగారాన్ని దుండగులు దోచుకున్నారు. షాపు వెనుక నుంచి రంధ్రం చేసి లోపలికి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. 700 తులాల బంగారు కడ్డీలు, ఆభరణాలు ఎత్తుకెళ్లారని యజమాని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దొంగలకు ఈ ప్రాంతంపై పట్టుందని, ఓ సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.


