News March 7, 2025

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో వాటికి పేమెంట్ జరిగి ప్రక్రియ పూర్తయ్యే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ GWMC కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా పంచాయతీ, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీ శాఖల్లో ఇప్పటి వరకూ పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 5, 2025

HYD: డ్రంక్‌ & డ్రైవ్‌లో దొరికి PS ముందే సూసైడ్

image

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమర్థవంతంగా పనిచేసే క్యాన్సర్ ఔషధం!

image

నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ (US) సైంటిస్టులు కీమోథెరపీ ఔషధాన్ని నానోటెక్నాలజీతో పునఃరూపకల్పన చేసి క్యాన్సర్ చికిత్సలో పెనుమార్పు తీసుకొచ్చారు. దుష్ప్రభావాలు కలిగించే 5-ఫ్లోరోయురాసిల్ (5-Fu) ఔషధాన్ని, స్ఫెరికల్ న్యూక్లియిక్ యాసిడ్ (SNA)గా మార్చారు. ఇది లుకేమియా కణాలను 20,000 రెట్లు ప్రభావవంతంగా నాశనం చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలానికి హాని చేయకుండా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుంటుంది.