News March 1, 2025
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ పై 25% రాయితీ: జిల్లా కలెక్టర్

శుక్రవారం సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణకు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. మార్చి 31వ తేదీతో లే అవుట్ల దరఖాస్తుల రుసుము చెల్లించే గడువు ముగుస్తుందన్నారు.
Similar News
News February 21, 2026
నల్లజర్ల: కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

నల్లజర్ల మండలం పుల్లలపాడు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. విధులు నిర్వహిస్తున్న బీట్ కానిస్టేబుల్ రవిని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో రవికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు ఆయనను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన బస్సు ఆపకుండా వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 21, 2026
అల్లు అర్జున్ ప్రైవేట్ పార్టీలో రామ్‌చరణ్, ఉపాసన

తన తమ్ముడు శిరీష్-నయనిక పెళ్లి నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. అత్యంత సన్నిహితులని మాత్రమే ఇన్వైట్ చేసిన ఈ పార్టీకి రామ్‌చరణ్-ఉపాసన దంపతులు హాజరయ్యారు. కాబోయే జంటతో పాటు అల్లు అర్జున్-స్నేహారెడ్డి, చెర్రీ-ఉపాసన దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. పార్టీకి మెగాస్టార్ కూతురు సుస్మిత, నిహారిక, వైష్ణవ్ తేజ్, సుశాంత్, తదితరులు హాజరయ్యారు. మార్చి 6న శిరీష్-నయనిక వివాహం జరగనుంది.
News February 21, 2026
శ్రీకాకుళం: మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం విడుదల

మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీం ద్వారా ఎక్స్ గ్రేషియా విడుదల చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శనివారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 95 మంది మత్స్యకారులు మృతిచెందగా వారిలో 90 మందికి రూ.4 కోట్ల 75 లక్షలు నిధులు విడుదల చేసి వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు జమ చేశామన్నారు. మిగిలిన ఐదుగురుకు సాంకేతిక కారణాల ద్వారా ఆగిందన్నారు.


