News March 16, 2025
ఎల్ఆర్ఎస్ పై నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ పై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. సంగారెడ్డి నుంచి మున్సిపల్, పంచాయతీ అధికారులతో శనివారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. రోజువారి నివేదికలను తనకు సమర్పించాలని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 8, 2026
సీజ్‌ఫైర్.. హార్ముజ్‌ను దాటాలంటే ఫీజు!

హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకలు/ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఇరాన్, ఒమన్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. సీజ్‌ఫైర్ ప్లాన్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. దేశాన్ని మళ్లీ నిర్మించుకునేందుకు ఈ డబ్బును ఉపయోగిస్తామని ఇరాన్ చెప్పినట్లు రీజినల్ అధికారి ఒకరు తెలిపారు. ఒమన్, ఇరాన్ దేశాల మధ్యలో హార్ముజ్ ఉంటుంది. అంతర్జాతీయ జలమార్గం కావడంతో యుద్ధానికి ముందు ఎన్నడూ టోల్ ఫీజులను ఎవరూ వసూలు చేయలేదు.
News April 8, 2026
NTR: పున్నమి ఘాట్‌లో వాటర్ స్పోర్ట్స్ హంగామా!

శాప్ లీగ్స్-2026లో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద వాటర్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ క్రీడల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని, యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇవి మంచి వేదికలని ఆయన పేర్కొన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు.
News April 8, 2026
4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశమంతటా ‘సర్’!

తుది దశ ఓటర్ల జాబితా సవరణ(సర్)ను 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. AP, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక సహా 17 రాష్ట్రాలు, 5 UTల్లో ఈ నెల 29 నుంచి చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటిదాకా 10 రాష్ట్రాలు, 3 UTల్లో ‘సర్’ పూర్తయింది. అస్సాంలో స్పెషల్ రివిజన్ నిర్వహించారు. మొత్తం 60 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించారు. తుది దశలో 39 కోట్ల మంది వివరాలు రివ్యూ చేయనున్నారు.


