News September 21, 2025
ఎల్కతుర్తి: ఎంగిలిపూల బతుకమ్మని ఎందుకు అంటారంటే?

బతుకమ్మని పేర్చేందుకు ఒకరోజు ముందే రకరకాల పువ్వులను సేకరించి వాటిని నీటిలో వేసి నిల్వ చేస్తారు. ఇలా ఒకరోజు నిద్ర చేసిన పువ్వులతో బతుకమ్మని మొదటి రోజున పేరుస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఎంగిలిపూల బతుకమ్మని.. మరికొన్ని ప్రాంతాల్లో తిన్న తర్వాత బతుకమ్మని పిలుస్తారు. బతుకమ్మ అందమైన పూల సంబరం. ఈరోజు నువ్వులు, బియ్యం పిండి, నూకల పిండి కలిపి నైవేద్యం సమర్పిస్తారు.
Similar News
News September 21, 2025
HYD: క్యాప్స్ గోల్డ్‌లో 5వ రోజు ఐటీ సోదాలు

క్యాప్స్ గోల్డ్‌లో 5వ రోజూ ఐటీ సోదాలుజరుగుతున్నయి. సికింద్రాబాద్‌లోని క్యాప్స్ గోల్డ్ కార్యాలయం సీజ్ చెయ్యగా ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చందా శ్రీనివాస్, అభిషేక్‌ను ఐటీ అధికారులు విచారించారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడలో బంధువులను బినామీలుగా ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
News September 21, 2025
KNR: ‘ఒక్కేసి పువ్వేసి’.. ఒక్కో రోజు.. తీరొక్క రూపంలో

ఉమ్మడి కరీంనగర్‌లో బతుకమ్మ సంబరాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో మహిళలు ఒక్కోరోజు ఒక్కో రూపంలో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి పూజిస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగుస్తాయి.
News September 21, 2025
మోదీని కలిశా కానీ మాట్లాడలేదు: ప్రకాశ్ రాజ్

ప్రధాని మోదీపై నిప్పులు చెరిగే సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను ఎయిర్‌పోర్టులో ఆయన్ను కలిశాను. కానీ మాట్లాడలేదు’ అని మోదీ కటౌట్ ఎదురుగా తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ‘మోదీని కలిసేంత కెపాసిటీ మీకు లేదు. ఇదే ఎక్కువ’ అని కొందరు ప్రకాశ్ రాజ్‌పై సెటైర్లు వేస్తున్నారు. ‘మోదీ టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు. మీతో అసలే మాట్లాడరు’ అని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.