News March 1, 2025

ఎల్కతుర్తి: క్రేన్ తగిలి తండ్రి, కొడుకు స్పాట్ డెడ్

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రేన్ తగిలి తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతులు కోతులనడుమ గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు, వికాస్‌గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 1, 2025

ఖమ్మం: ‘విద్యార్థులను వేధిస్తున్న లెక్చరర్’

image

బాడీ పార్ట్స్ తాకనిస్తేనే ఇంటర్నల్ మార్కులు వేస్తానని ఇంటర్ విద్యార్థులను ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ వేధించిన ఘటన ఖమ్మం నగరంలో జరిగింది. విద్యార్థులు తెలిపి వివరాలు.. ఖమ్మం వాసి కొండా హరిశంకర్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థి సంఘం నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు.

News March 1, 2025

నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం: CP

image

నేరాల నియంత్రణలో నార్కోటిక్, ఎక్స్ క్లూజివ్, గంజాయి వాటిని గుర్తించడంలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఈ జాగిలాలు ఏడాది శిక్షణ పూర్తి చేసుకొని రామగుండం కమిషనరేట్‌కు వచ్చాయన్నారు. డాగ్స్& డాగ్స్ హ్యాండ్లర్స్ పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

News March 1, 2025

ప్రజల వద్దే రూ.6,471 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు

image

దేశంలోని ప్రజల నుంచి 98.18% ₹2,000 నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు RBI వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇంకా 1.82%(₹6,471కోట్లు) నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. 2023 మే 19న ₹3.56 లక్షల కోట్ల విలువైన ₹2వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ నోట్లను RBI రీజినల్ కార్యాలయాల వద్ద ఎక్స్‌ఛేంజ్/డిపాజిట్ చేసుకోవచ్చు.

error: Content is protected !!