News November 21, 2025
ఎల్కతుర్తి: రైతులందరూ ఉపయోగించుకోవాలి: కలెక్టర్

ఎల్కతుర్తి మండలంలోని CCS పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఇంతకు ముందు పత్తిని రైతులు దూర ప్రాంతాల్లో అమ్ముకొనే వారు, కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ప్రాంతాల్లో అమ్ముకునేందుకు CCS కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఛైర్మన్ సంతాజీ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
కష్టపడిన ప్రతీ ఒక్కరికి అవార్డు అంకితం: జనగామ కలెక్టర్

జల సంజయ్ జన భాగీదారి-1.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో జనగామ జిల్లాకి అవార్డు వచ్చిన సందర్భంగా క్షేత్రస్థాయిలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులకు గురువారం కలెక్టర్ అవార్డు ప్రదానం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేస్తేనే కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పలు అంశాల్లో జిల్లాకి అవార్డులు వచ్చాయన్నారు. కష్టపడిన ప్రతీ ఒక్కరికి అవార్డు అంకితమన్నారు.
News November 21, 2025
స్టేషన్ ఘనపూర్‌కు నూతన చర్మ వైద్య నిపుణురాలు

స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ జువేనియా అఫ్రీన్ (డెర్మటాలోజిస్ట్) చర్మ వైద్య నిపుణులు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఆమె రాకతో చర్మ వ్యాధులకు ఇకపై ఇక్కడే చికిత్స అందనుంది. గతంలో ఇక్కడ డెర్మటాలజిస్ట్‌గా పనిచేసిన డాక్టర్ వీరాంజనేయులు డీసీహెచ్ఎస్ పనిచేసి పదవీ విరమణ పొందారు. సుమారు గత 4 నెలలుగా చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
News November 21, 2025
భూపాలపల్లి: 22న సింగరేణిలో డయల్ యువర్ సీఎండీ

సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం” నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నదలచిన వారు 040-23311338 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల కార్మికులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.


