News March 26, 2025

ఎల్బీనగర్‌లో మర్డర్.. నిందితుల అరెస్ట్

image

LBనగర్ శివగంగకాలనీలో మార్చి 23న పాతకక్షలతో మహేశ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పురుషోత్తం, నాగార్జున, సందీప్, రాము, రాజరాకేశ్, కుంచల ఓంకార్‌ నిందితులుగా ఉన్నారు. వీరి నుంచి ఫోన్‌లు, బైకు, కారు, గొడ్డలి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు CI వినోద్ కుమార్ తెలిపారు.

Similar News

News January 27, 2026

ఫైబర్ ఎందుకు తీసుకోవాలంటే..

image

మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాల్లో ఫైబర్ ఒకటి. ఇందులో సాల్యుబుల్ ఫైబ‌ర్, ఇన్ సాల్యుబుల్ ఫైబ‌ర్‌ అనే రకాలుంటాయి. దీనివల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగయ్యి గ్యాస్‌, అసిడిటీ, ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. కొలెస్ట్రాల్‌, బీపీ, షుగర్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. పురుషులకు రోజుకు 30 గ్రా, స్త్రీల‌కు 25 గ్రా ఫైబర్ అవ‌స‌రం. 2-5 ఏళ్ల పిల్ల‌ల‌కు 15 గ్రా, 5-11 ఏళ్లు పిల్లలకు 20 గ్రా వ‌ర‌కు రోజూ ఫైబ‌ర్ కావాలి.

News January 27, 2026

నల్గొండలో రూ.8 కోట్లతో స్కూల్ నిర్మాణం.. నేడే ప్రారంభం

image

కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సుమారు రూ.8 కోట్లతో నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల అత్యాధునిక భవనాన్ని మంత్రి వెంకటరెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఇక్కడ రాష్ట్రంలోనే తొలిసారిగా ‘వాల్డార్ఫ్’ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్స్, లిఫ్ట్ సౌకర్యం వంటి కార్పొరేట్ స్థాయి వసతులు ఇక్కడ ఉన్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందే విధంగా విద్యాబోధన చేయనున్నారు.

News January 27, 2026

బీజేపీ vs కాంగ్రెస్.. ‘పట్కా’ వివాదం

image

రిపబ్లిక్‌ డే వేడుకలు INC-BJP మధ్య వివాదానికి కారణమైంది. రాహుల్‌, ఖర్గేలకు <<18966146>>మూడో వరుసలో<<>> సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్‌ అవమానంగా భావిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రోటోకాల్‌ ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగిందని BJP స్పష్టం చేసింది. మరోవైపు సాయంత్రం రాష్ట్రపతి ‘ఎట్ హోమ్‌’ కార్యక్రమంలో ముర్ము చెప్పినా ఈశాన్య ప్రాంత సంప్రదాయమైన పట్కాను (స్కార్ఫ్ వంటి వస్త్రం) రాహుల్‌ ధరించలేదంటూ మరో వివాదం చెలరేగింది.