News February 11, 2025

ఎల్బీనగర్‌: మైనర్ బాలికపై లైంగిక దాడి.. జీవిత ఖైదు

image

ఎనిమిదేళ్ల మైనర్ బాలికను మాయమాటలతో ఆశచూపి, అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ షేక్ జావీద్(27) దోషి అని తేలడంతో అతడిపై అత్యాచారం, పోక్సో చట్ట ప్రకారం కేసు నమోదైంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు, రూ.25వేల జరిమానా, బాధితురాలకి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని తీర్పునిచ్చింది.

Similar News

News January 6, 2026

నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

image

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఎర్లీ ట్రేడులో నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 26,200 వద్ద, సెన్సెక్స్ 60 పాయింట్లు క్షీణించి 85,379 వద్ద ట్రేడవుతున్నాయి. FMCG, ఆయిల్ అండ్ గ్యాస్, మీడియా రంగాల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి, డాబర్, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC Bank నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, ICICI Bank, టాటా స్టీల్‌ షేర్లపై ఆసక్తి కనిపిస్తోంది.

News January 6, 2026

ఆగిన తవ్వకాలు… అదును చూసి మొదలెడతారా…!

image

తొట్టంబేడు మండలంలోని రౌతు సూరమాల, కల్లిపూడి, మల్లిగుంట, లింగంనాయుడుపల్లి, శివనాదపాలెం, శివనాధపురం, కాసరం గ్రామాల నుంచి మట్టి మాఫియా చెలరేగిపోతుంది. కంపెనీలకు తరలింపు పేరుతో యూనిట్‌కి రూ.1500- రూ.3000 చొప్పున APIIC, తెలుగుగంగ, ప్రభుత్వ DKT భూముల నుంచి యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నారు. అయితే గత 2 రోజులుగా మట్టి తవ్వకాలు ఆగాయి. మళ్లీ ఎప్పడు తవ్వకాలు మొదలు పెడతారో అని
గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది.

News January 6, 2026

పంట వ్యర్థాలను కాల్చొద్దు: వరంగల్ డీఏవో

image

ప్రత్తి పంటల కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నడం ద్వారా రైతులు అధిక లాభాలు పొందడంతోపాటు భూసారం పెంచి, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి కె.అనురాధ తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల భూమిలోని మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు నశించడమే కాకుండా గాలి కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె హెచ్చరించారు.