News May 1, 2024
ఎల్బీనగర్: విద్యుత్ సమస్యలు ఏర్పడితే కాల్ చేయండి

ఎల్బీనగర్ పరిధిలోని సరూర్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, గ్రీన్ హిల్స్, బండ్లగూడ, హయత్ నగర్, ఆటోనగర్, శాంతినగర్ కరెంటు సంబంధిత సమస్యలు ఏర్పడితే సంబంధిత అధికారికి తెలియజేయాలని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అధికారుల నెంబర్లను తెలిపి, అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. స్థానికంగా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ సెకండియర్‌లో RRకు 5TH ర్యాంక్

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. RR(D)లో రెగ్యులర్ విద్యార్థులు 74723 మంది పరీక్షలు రాయగా 60981 మంది పాసై 81.61 శాతంతో స్టేట్‌లోనే 5th ర్యాంక్ వచ్చింది. రెగ్యులర్ ఒకేషనల్‌లో 3042మందికి 2279 మంది పాసై 74.92%తో 15వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 7,246మందికి 2106 మంది పాసై 29.06%తో 26వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 223 మందికి 115 మంది పాసై 51.57%తో 17వ ప్లేస్ వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ 1st ఇయర్ ఫలితాల్లో RRకి 2nd ర్యాంక్

ఇంటర్ 1st ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెగ్యులర్ 1st ఇయర్ విద్యార్థులు 80,096 మంది పరీక్షలు రాయగా 61,177 మంది పాసై 76.38 శాతంతో స్టేట్‌లోనే సెకండ్ ర్యాంక్‌లో నిలిపారు. ఇక ఒకేషన్‌లో 3,946 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 2,438 మంది విద్యార్థులు పాసవ్వడంతో 61.78 శాతంతో స్టేట్‌లో 16వ స్థానంలో నిలిచింది.
News April 11, 2026
RR: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

ఇంటర్ ఫలితాలు ఆదివారం ఉ.11 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 84,301 మంది, ద్వితీయ సంవత్సరంలో 70,171 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.


