News March 26, 2024
ఎల్బీనగర్: HOSTELలో యువకుడి SUICIDE

HYD వనస్థలిపురం PS పరిధిలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. నెల్లూరుకు చెందిన కిరణ్ కుమార్(26) వనస్థలిపురంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. సోమవారం గదిలోకి వెళ్లిన అతడు ఎంతకూ బయటకు రాలేదు. యజమాని కిటికీలోంచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 22, 2025
ఇబ్రహీంపట్నం: ఈ నెల 24న బడుల్లో వంట బంద్

రంగారెడ్డిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం CITU ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం MEOకు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. కానీ, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 24న బడుల్లో ‘వంట బంద్’ చేసి చలో కలెక్టరేట్‌లో పాల్గొంటామన్నారు.
News February 22, 2025
కీసరగుట్ట జాతర.. 2,000 మందితో బందోబస్తు!

కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కోసం కట్టుదిట్టంగా భద్రతను చేపడుతున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 2,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు CP పేర్కొన్నారు. ఆలయం వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
News February 21, 2025
HYD: దాడి కేసులో నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే. రంగరాజన్‌పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డికి పోలీసు కస్టడీ ముగిసింది. 3 రోజులపాటు కస్టడీలో పోలీసులు వీరరాఘవ రెడ్డిని విచారించారు. కస్టడీ ముగియడంతో నిందితుడిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి.. ఆపై చంచల్‌గూడ జైలుకి తరలించారు. కాగా.. నిందితుడు తెలుగు రాష్ట్రాల్లోని 6 ప్రధాన ఆలయాలకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.