News March 18, 2025
ఎల్లనూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్

ఎల్లనూరులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అర్చనలు నిర్వహించారు. ☛ 18న సింహ వాహనం ☛ 19న శేష వాహనం ☛ 20న హనుమంత వాహనం☛ 21న గరుడ వాహనం☛ 22న కళ్యాణోత్సవం☛ 23న రథోత్సవం☛ 24న అశ్వ వాహనం☛ 25న వసంతోత్సవం, హంస వాహనం☛ 26న ఏకాంతోత్సవం
Similar News
News March 18, 2025
సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యమే కీలకం: ఎస్పీ

సైబర్ నేరాల దర్యాప్తులో సాంకేతిక నైపుణ్యమే కీలకమని జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని పోలీసు అధికారులకు సైబర్, ఇతర నేరాలలో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌పై వర్క్ షాప్ నిర్వహించారు. హైదరాబాద్ నుండీ వచ్చిన సైబర్ ఎక్స్పర్ట్ రామాంజినేయులచే సైబర్ నేరాల శోధనలో పాటించాల్సిన మెళకువలపై అవగాహన కల్పించారు. కేసు ఛేదనలో ప్రతీ అంశాన్ని కీలకంగా తీసుకోవాలన్నారు.
News March 18, 2025
మాతృ, శిశు మరణాలు అరికట్టాలి: డీఎంహెచ్‌వో

మాతృ, శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్‌వో దేవి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. శిశు, మాతృ మరణాలు జరిగినప్పుడు మరణానికి ముందు ఎదురైన ఇబ్బందులు, కారణాలు తెలుసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. మరోసారి మరణం జరగకుండా వైద్యులు, సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణి డెలివరీ తరువాత కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.
News March 18, 2025
అరకు కాఫీ తాగిన జిల్లా ఎమ్మెల్యేలు

దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు పొందిన అరకు కాఫీ స్టాల్‌ను అసెంబ్లీ మెయిన్ ఎంట్రీ లాబీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ స్టాల్‌ను అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు, గుమ్మనూరు జయరాం సహచర ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. అక్కడ అరకు కాఫీ ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహచర ఎమ్మెల్యేలతో అరకు కాఫీ తాగారు.