News March 24, 2025

ఎల్లనూరు మండలంలో 971 ఎకరాలలో పంట నష్టం

image

ఎల్లనూరు మండల వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా 971 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 215 మంది రైతులు సాగు చేసిన 971 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు.

Similar News

News August 11, 2025

ఈనెల 18న కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా

image

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేయనున్నట్లు బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు తెలిపారు. రాయదుర్గంలో ఆదివారం స్థానిక కమిటీల ఏర్పాటు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని మండిపడ్డారు.

News August 10, 2025

79 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ

image

అనంతపురంలోని క్లాక్ టవర్ నుంచి 79 అడుగుల జాతీయ జెండాతో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర విశ్వవిద్యాలయం తరుపున హర్ ఘర్ తిరంగా ర్యాలీని విజయవంతంగా నిర్వహించామన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

News August 10, 2025

రేపు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

అనంతపురం కలెక్టరేట్‌లో రేపు ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం జరుగుతుందని ఇన్‌ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. అలాగే అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్‌లోనూ అర్జీలు సమర్పించొచ్చని చెప్పారు.