News May 3, 2024
ఎల్లారెడ్డిపేటలో ఎక్సైజ్ ఎస్ఐ మృతి

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాళీ ప్రసాద్(54)మూడు నెలల క్రితం బదిలీపై ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. మండల కేంద్రంలో ఇంట్లో అద్దెకు ఉంటుంన్నారు. శుక్రవారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News August 31, 2025
KNR: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వైజ్ఞానిక అధ్యయన తరగతులు

ఉమ్మడి KNR, NZB జిల్లాల జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో KNRలోని ఫిల్మ్ భవన్లో ఆదివారం అధ్యయన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రామచంద్రయ్య ‘శాస్త్రం, శాస్త్ర ప్రచారం, సవాళ్లు’ అంశంపై ప్రసంగించారు. రాజా రాజా ‘ప్రజా సైన్స్ ఉద్యమం, తాత్వికత, అనుభవాలు’ పంచుకోగా, చెలిమెల రాజేశ్వర్ జెవివి కార్యక్రమాలు, పర్యావరణ స్పృహపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెవివి ఆశావహులు పాల్గొన్నారు.
News August 31, 2025
కరీంనగర్లో SEPT 3న JOB MELA..!

నిరుద్యోగులకు ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. SEPT 3న జిల్లా ఉపాధి కార్యలయంలో ఈ JOB MELA నిర్వహిస్తునట్లు చెప్పారు. 120పోస్టులు ఉన్నాయని.. ఫార్మాసిస్టు, సేల్స్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 10TH నుంచి ఫార్మసీ చదివినవారు అర్హులని, వయసు 18-30ఏళ్లలోపు ఉండాలన్నారు. 9392310323, 9908230384 నంబర్లను సంప్రదించవచ్చు.
News August 31, 2025
KNR: వరద కాలువలో గల్లంతైన రహీం మృతదేహం లభ్యం

కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలోకి వచ్చే ప్రధాన కాలువ చింతకుంట వద్ద చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిన రహీం మృతదేహం లభ్యమైనట్లు శనివారం కొత్తపల్లి పోలీసులు తెలిపారు. అబ్దుల్ రహీం(20) అనే వ్యక్తి గురువారం చేపలు పట్టడానికి వెళ్లి చింతకుంట ఎస్ఆర్ఎం కాలేజ్ వెనకాల ఉన్న వరద కాలువలో పడి గల్లత్తు కాగా, రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.