News December 21, 2025
ఎల్లారెడ్డిపేటలో దొంగనోట్ల కలకలం

ఎల్లారెడ్డిపేట మండలంలో దొంగనోట్ల చలామణి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను అదునుగా చేసుకుని పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని తరలించినట్లు తెలుస్తోంది. ప్రచారంలో పాల్గొన్న కార్యకర్తలకు, ఓటర్లకు వీటిని పంపిణీ చేసినట్లు సమాచారం. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన నోటును గమనించిన వ్యాపారి అది నకిలీదని గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనా సమాచారం.
Similar News
News December 21, 2025
ఆర్మీ అధికారి ఇంట్లో ₹2 కోట్లు.. లంచం తీసుకుంటూ దొరికిన వైనం!

డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్స్‌లో పని చేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మను లంచం తీసుకుంటుండగా CBI అరెస్ట్ చేసింది. ఆయన ఇంట్లో ₹2 కోట్లకు పైగా క్యాష్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల నుంచి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావటంతో CBI రంగంలోకి దిగి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఢిల్లీ, బెంగళూరులోని దీపక్ సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు.
News December 21, 2025
NIT పాండిచ్చేరిలో నాన్ టీచింగ్ పోస్టులు

<
News December 21, 2025
ఉమ్మడి విశాఖ డూమా ఇంచార్జ్ పీడీగా రవీంద్ర

ఉమ్మడి విశాఖ జిల్లా డూమా ఇన్‌ఛార్జ్ పీడీగా రవీంద్ర ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పీడీగా పనిచేసిన పూర్ణిమా దేవి వ్యక్తిగత కారణాల వల్ల 38 రోజులపాటు సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో డూమా ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎస్.రవీంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.


