News March 27, 2025
ఎల్లారెడ్డిపేట: మోర్చా కార్యదర్శిగా బుర్కా సంగీత

రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా కార్యదర్శిగా బుర్కా సంగీత నియమించినట్లు ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి తెలిపారు. బుర్కా సంగీత గత 20 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, భూత్ అధ్యక్షరాలిగా, మండల నాయకురాలిగా భారతీయ జనతా పార్టీలో వివిధ పదవులు పొంది ఇప్పుడు మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిగా నియమించడం సంతోషకరమని మండల నాయకులు అందరూ అభినందనలు తెలిపారు.
Similar News
News February 20, 2026
ద్రవిడ వర్సిటీకి పెరిగిన గ్రాంట్

కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి TTD నుంచి అందుతున్న వార్షిక నిర్వహణ గ్రాంట్‌ను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ.50 లక్షలు అందుతుండగా, 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని రూ.1 కోటికి పెంచింది. TTD బోర్డు తీర్మానం మేరకు ఈ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో విశ్వవిద్యాలయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల బలోపేతానికి తోడ్పాటు లభించనుంది.
News February 20, 2026
డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి కొత్త నిబంధనలు!

TG: డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్(DL), లైబ్రేరియన్, PD పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఎంపిక ప్రక్రియను 3 విభాగాలు చేసింది. ఇకపై అకడమిక్ మెరిట్‌కు గరిష్ఠంగా 50%, రాత పరీక్షకు 40%, ఇంటర్వ్యూకు 10% మార్కులు కేటాయించింది. గతంలో రాతపరీక్షకే 100% మార్కులుండేవి. ఈ పోస్టులను TGPSC ద్వారానే భర్తీ చేయనుంది. 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
News February 20, 2026
ఫోన్ పే, GPayలో లంచాలు.. 8 మంది ఆఫీసర్లపై వేటు!

TG: వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటున్న విద్యుత్ అధికారులపై TGSPDCL సీఎండీ ముషారఫ్ చర్యలు తీసుకున్నారు. ఫైళ్ల క్లియరెన్స్, కొత్త కనెక్షన్లు, రెగ్యులర్ సర్వీసులకూ డబ్బు వసూలు చేసిన 8 మందిని సస్పెండ్ చేశారు. ఇందులో ఒక ADE, ముగ్గురు ఇంజినీర్లు ఉన్నారు. దక్షిణ డిస్కమ్ పరిధిలో 150కి పైగా ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ జరిపారు. ఆ 8 మంది ఫోన్ పే, GPay ద్వారా లంచాలు తీసుకున్నట్లు గుర్తించారు.


