News February 18, 2025
ఎల్లారెడ్డిపేట: విషాదం.. వ్యక్తి ఆత్మహత్య

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన వివరాలు.. హనుమ కనకయ్య(40) అప్పుల బాధతో మద్యానికి బానిస అయ్యాడు. సోమవారం ఉదయం అతడి బెడ్రూమ్లో ఉరేసుకుని చనిపోయినట్లు అతడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Similar News
News December 14, 2025
బిగ్బాస్-9.. భరణి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.
News December 14, 2025
మంచిర్యాల జిల్లాలో 56.44% పోలింగ్

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న 2వ విడత పోలింగ్ 56.44% జరిగినట్లు అధికారులు తెలిపారు. బెల్లంపల్లిలో 63.5%, భీమిని 67.5%, కన్నెపల్లి 62.56, కాసిపేట 51.49%, నెన్నెల 55.56%, తాండూర్ 48.58%, వేమనపల్లిలో 57.07% పోలింగ్ నమోదయింది. .
News December 14, 2025
వనపర్తి జిల్లాలో పోలింగ్ శాతం @11AM

రెండో విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లాలోని ఐదు మండలాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా అధికారులు మండలాల వారిగా ఉదయం 11 గంటల వరకు పోలింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 59.7% పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా. వనపర్తి 56.4%, కొత్తకోట 60.4%, మదనాపూర్ 60.9%, ఆత్మకూరు 57.8%, అమరచింత 67.0% పోలింగ్ నమోదైంది.


