News March 26, 2024

ఎల్లారెడ్డిలో బైక్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ మహేశ్ వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి నిజాంసాగర్ వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడు మహమ్మద్ నగర్ మండలం అసన్ పల్లికి చెందిన కురుమ ప్రశాంత్ (23)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 7, 2025

నిజామాబాద్: బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా బొబ్బిలి నరేష్

image

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు బొబ్బిలి నరేష్ బాస్కెట్‌బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా సేవలందించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. 30 ఏళ్లుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో సేవలు అందించడంతో ఈ అవకాశం వచ్చిందన్నారు. ఆయన్ను పలువురు అభినందించారు.

News September 7, 2025

NZB: ఆలయాల మూసివేత

image

సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయాలను మూసివేశారు. నీలకంఠేశ్వరాలయం, గోల్ హనుమాన్, జెండా బాలాజీ, శంభుని గుడి, రామాలయం, శ్రీకృష్ణ టెంపుల్, సారంగపూర్ హనుమాన్ ఆలయం, రోకడ్ హనుమాన్ ఆలయం తదితర ఆలయాలను పూజారులు మూసివేశారు. తిరిగి సోమవారం సంప్రోక్షణ చేసిన అనంతరం నిత్య పూజలు చేయనున్నారు.

News September 7, 2025

ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర: MLA ధన్పాల్

image

జెండా బాలాజీ జాతర ఉత్సవాలకు వందేళ్ల ఘనమైన చరిత్ర ఉందని నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం ఆయన జెండా బాలాజీ ఆలయంలో నిర్వహించిన జాతర కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో జిల్లా మరింత అభివృద్ధి చెందాలని, జిల్లా ప్రజలందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.