News February 5, 2026
ఎల్లారెడ్డి: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పరిశీలించిన జిల్లా నోడల్ అధికారి

ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను గురువారం జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, ఆర్డీఓ పార్థ సింహారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన మొదటి విడత పరీక్షలు ప్రశాంతంగా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయని వారు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News February 6, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 06, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.47 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.38 గంటలకు ♦︎మఘ్రిబ్: సాయంత్రం 6.14 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.28 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 6, 2026
నెయ్యి వివాదం.. TTD నూతన ఈవో ఏమంటారో..?

తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. సిట్ రిపోర్ట్ ఆధారంగా సింఘాల్‌ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే నూతన ఈవో ముందు ఉన్న అనేక సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కల్తీ నెయ్యి విషయంలో ఆయన ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.
News February 6, 2026
బర్డ్ ఫ్లూతో కాకులు మృతి.. చెన్నైలో అలర్ట్

తమిళనాడులో బర్డ్ ఫ్లూ కేసులు కలవరపెడుతున్నాయి. చెన్నైలోని అడయార్, అవడి, ఈసీఆర్‌లో జనవరి నుంచే 1000కిపైగా కాకులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కాకుల మరణంపై బోపాల్‌లోని లాబోరేటరీలో చేసిన పరీక్షల్లో H5N1 వైరస్ కారణమని తేలింది. దీంతో పక్షులు చనిపోయి కనిపిస్తే తాకకూడదని, పిల్లలను దూరంగా ఉంచాలని ప్రజలకు అధికారులు సూచించారు. పక్షులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలన్నారు.


