News November 6, 2025
ఎల్లారెడ్డి: సలహాదారుడిని కలిసిన ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు తీసుకున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం పలు సమస్యలపై ఇరువురు చర్చించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు.
Similar News
News April 17, 2026
సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా చెస్ పోటీలు

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఏప్రిల్ 19న సూర్యాపేట టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్నాయి. అండర్ 7, 11, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఎఫ్ఐడీఈ (FIDE) నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వివరాల కోసం 9394753343 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.
News April 17, 2026
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం నగరంలోని ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. గోల్డెన్ అవర్‌లో సహాయం చేసిన వారికి రాహవీర్ పథకం కింద రూ.25 వేలు బహుమతి అందిస్తామని చెప్పారు. 30 బ్లాక్ స్పాట్ల సరిదిద్దడంతో ప్రమాదాలు తగ్గాయని వివరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై ఏఐ ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News April 17, 2026
తాత్కాలిక సీజ్‌ఫైర్‌లు మాకొద్దు: ఇరాన్

లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య 10రోజుల సీజ్‌ఫైర్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. లెబనాన్ నుంచి మొదలుకొని ఎర్రసముద్రం వరకు ఈ ఏరియాలో ఎలాంటి అశాంతి లేకుండా ఉండటమే తమకు కావాలని స్పష్టం చేసింది. తాత్కాలిక సీజ్‌ఫైర్‌లను ఒప్పుకోబోమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న హింస ఇక్కడితో శాశ్వతంగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయీద్ వెల్లడించారు.


