News December 12, 2025
ఎల్లారెడ్డి: 2వ విడత ప్రచారం నేటి సాయంత్రం వరకే

కామారెడ్డి జిల్లాలో 2వ విడత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను అధికారులు వెల్లడించారు. 8 మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో శుక్రవారం సాయంత్రం 5 గం.లకు ప్రచార పర్వం ముగియనుంది. 197 సర్పంచి స్థానాల్లో 41 ఏకగ్రీవం కాగా 156 సర్పంచి స్థానాలకు 482 మంది, 1,654 వార్డు స్థానాల్లో 778 ఏకగ్రీవం కాగా 872 వార్డు స్థానాలకు 2,098 మంది బరిలో నిలిచారు. 4 స్థానాలకు నామినేషన్లు రాలేదు.
Similar News
News December 12, 2025
విశాఖ నుంచి సేవలు అందించనున్న IT సంస్థలు

AP: CM CBN కాగ్నిజెంట్ సహా 8 IT సంస్థల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ నిర్మాణం 3 దశల్లో పూర్తి కానుంది. కాగా ఈ సంస్థలన్నీ విశాఖ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. వీటి ద్వారా రాష్ట్రానికి ₹3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇప్పటికే VSP నుంచి 150కి పైగా కంపెనీలు సేవలందిస్తున్నాయని, ఐటీ నిపుణులకు అవకాశాలు పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది.
News December 12, 2025
విశాఖలో సత్వా వాంటెజ్ సంస్థకు శంకుస్థాపన

దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన సత్వా వాంటెజ్ క్యాంపస్‌ను ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 3 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్‌లో 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, పరోక్షంగా 50 వేల మంది వరకు ఉపాధి పొందుతారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
News December 12, 2025
ప్రభుత్వ టీచర్ ఆదర్శం!

➤ తన బిడ్డకూ అదే బడి
SS: గవర్నమెంట్ టీచర్ తన కుమారుడినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రానికి చెందిన స్వర్ణ సోమందేపల్లి మండలంలోని కొలిమిపల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. తన కుమారుడు సాత్విక్‌ను ఇదే పాఠశాలలో చదివిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందుతోందనడానికి ఇదే నిదర్శనమని కొనియాడుతున్నారు.


