News November 16, 2025

ఎల్లుండి ఉ.10 గంటలకు..

image

AP: ఫిబ్రవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఈనెల 18న 10AMకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న 10AM వరకు నమోదుచేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం లోపు డబ్బు చెల్లించాలి. 21న కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఊంజల్ సేవ తదితర టికెట్లు, 24న శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, 25న రూ.300 టికెట్ల కోటాను రిలీజ్ చేస్తారు.

Similar News

News March 29, 2026

జోనితా గాంధీ ఎవరంటే?

image

‘చిచ్చుబుడ్డి’ <<19508487>>పాటలో<<>> స్టెప్పులతో అదరగొట్టిన జోనితా గాంధీ గాయని. తెలుగు, హిందీ తదితర భాషల్లో సాంగ్స్ పాడారు. మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో తొలుత SPBతో పాట పాడే అవకాశం ఆమెకు వచ్చింది. ‘కిక్-2’లోని ‘నువ్వేనువ్వే’ పాటతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. OK బంగారం, 24 తదితర సినిమాల్లో పాటలు పాడారు. ఢిల్లీలో పుట్టిన ఆమె టొరంటోలో చదువుకొని సంగీతంపై ఇష్టంతో ఇండియాకు తిరిగొచ్చారు.

News March 29, 2026

వేసవిలో కూలింగ్ వాటర్ తాగితే?

image

ఎండ తాపాన్ని తట్టుకోవడానికి సమ్మర్‌లో కూలింగ్ వాటర్ తాగుతుంటారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తవచ్చు. చల్లటి నీరు గొంతు గరగరకు కారణమవుతుంది. బాడీ వేడిగా ఉండే వేసవిలో కూలింగ్ వాటర్ తాగితే శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు వస్తుంది. కొందరికి తలనొప్పి, అలసటగా కూడా కలిగిస్తుంది’ అని చెబుతున్నారు.

News March 29, 2026

KKR విధ్వంసం.. ఒకే ఓవర్లో 26 పరుగులు

image

MIతో జరుగుతున్న మ్యాచులో KKR ఓపెనర్లు రహానే, అలెన్ విరుచుకుపడుతున్నారు. హార్దిక్ వేసిన 4వ ఓవర్లో ఏకంగా 26 రన్స్ బాదారు. తొలుత రహానే 2 సిక్సులు కొట్టగా, అలెన్(37) 3 ఫోర్లు బాదారు. ఒక వైడ్, లెగ్ బైస్ ద్వారా పెద్ద ఓవర్‌గా మారింది. దీంతో 4 ఓవర్లు ముగిసే లోపే జట్టు స్కోర్ 50 పరుగులు దాటింది. MIపై KKRకు ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కావడం విశేషం.