News December 17, 2025

ఎల్లుండి గవర్నర్‌తో జగన్ భేటీ

image

AP: ఈ నెల 18న 4PMకు జగన్ గవర్నర్‌ను కలిసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి <<18575709>>సంతకాల<<>> పత్రాలను అందజేస్తారని వైసీపీ తెలిపింది. అంతకుముందు 10AMకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సంతకాల పత్రాలు నిండిన వాహనాలను జగన్ జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపిస్తారని వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో సమావేశం అవుతారని వివరించింది.

Similar News

News December 20, 2025

PCOSలో ఎన్ని రకాలున్నాయో తెలుసా?

image

ప్రస్తుతకాలంలో చాలామందిలో PCOS సమస్య కనిపిస్తోంది. అయితే ఇందులో A, B, C, D అని 4 రకాలున్నాయంటున్నారు నిపుణులు. A రకంలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాకపోవటం, అండాశయాల్లో తిత్తులు ఉంటాయి. Bలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి అస్తవ్యస్తమవటం ఉంటాయి. Cలో- మగ హార్మోన్లు, తిత్తులూ ఉంటాయి. కానీ నెలసరి అవుతుంది. Dలో నెలసరి రాకపోవడం , తిత్తులు ఉన్నప్పటికీ మగ హార్మోన్లు ఎక్కువగా ఉండవు.

News December 20, 2025

ఈ కలుపు మందులతో వయ్యారిభామ నిర్మూలన

image

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.

News December 20, 2025

గోదావరి పుష్కరాలకు రూ.3వేల కోట్లు?

image

AP: 2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. ఏలూరు, కాకినాడ, తూ.గో, ప.గో, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 500+ ఘాట్లు సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈసారి పుష్కరాల నిర్వహణ ఖర్చు ₹3,000Cr అవుతుందని అంచనా. ఇందులో కేంద్రం నుంచి మెజారిటీ వాటా తెప్పించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2015లో 4.50Cr మంది పుష్కర స్నానాలు ఆచరించారు. ఈసారి ఈ సంఖ్య 10Cr+ ఉంటుందని అంచనా.