News April 15, 2024
ఎల్లుండి పీలేరుకు షర్మిల రాక

పీలేరులో షర్మిల నిర్వహించనున్న న్యాయ యాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈనెల 16వ తేదీన మంగళవారం ఉదయం 10 గంటలకు పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో రోడ్ షో ఉంటుదని తెలిపారు. కార్యక్రమంలో అమృతతేజ, దుబ్బా శ్రీకాంత్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 7, 2025
చిత్తూరు: బ్యానర్ల ఏర్పాటుపై ప్రిన్సిపల్‌కు మెమో

చిత్తూరులోని స్థానిక పీసీఆర్ కళాశాల ప్రాంగణంలో రాజకీయ పార్టీల బ్యానర్లు ఏర్పాటు చేయడంపై ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రిన్సిపల్ అబ్దుల్ మజీద్‌కు మెమో జారీ చేసింది. బ్యానర్లు ఏర్పాటుతోపాటు ప్రిన్సిపల్ ఫోటో ప్రచురించడంపై ఇంటర్మీడియట్ బోర్డు వివరణ కోరింది. కళాశాల విద్యార్థుల అర్ధ నగ్న ఫోటోలు ప్రదర్శించారని బోర్డుకు ఫిర్యాదులు అందాయి. పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది.
News October 6, 2025
స్వచ్ఛతలో అందరూ భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

స్వచ్ఛతలో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సోమవారం స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి విశిష్ట అతిథిగా గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్ మురళీమోహన్ హాజరయ్యారు. స్వచ్ఛతలో రాష్ట్రస్థాయిలో ఏడు అవార్డులు, జిల్లాస్థాయిలో 55 అవార్డులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
News October 6, 2025
చిత్తూరు విద్యార్థికి రాష్ట్రపతి అవార్డు

చిత్తూర్ అపోలో యూనివర్సిటీ విద్యార్థికి రాష్ట్రపతి అవార్డు దక్కింది. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్‌లో 2022-23 వాలంటీర్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపదీముర్ము నుంచి విద్యార్థి జిష్ణు అందుకున్నాడు. ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జిష్ణు పర్యావరణ పరిరక్షణ, రక్తదానం, సామాజిక సేవ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొన్నారు.