News February 9, 2026

ఎల్లుండి వరకు వైన్స్, బార్లు బంద్

image

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాల బంద్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో ఈ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించనున్నారు. ఈ నెల 11వ తేదీ ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News February 14, 2026

40 తర్వాత ఆహారంలో ఇవి చేర్చుకోండి

image

వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ క‌చ్చితంగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. 40 ఏళ్ల‌కు పైబ‌డిన త‌రువాత జంక్ ఫుడ్‌కు పూర్తిగా స్వ‌స్తి చెప్పి ఆహారంలో టమాటాలు, చిల‌గ‌డదుంప‌లు, కోడిగుడ్లు, పుట్ట గొడుగులు, యాపిల్ పండ్లు, బాదం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో అజీర్తి, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం తగ్గుతాయి. కొలెస్ట్రాల్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ఉండి గుండెజబ్బులు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

News February 14, 2026

IND vs PAK: హ్యాండ్ షేక్‌పై పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

image

T20 WCలో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరగనున్న భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ‘హ్యాండ్‌ షేక్’ అంశం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. Asia Cupలో టీమ్ ఇండియా ప్లేయర్లు పాక్‌తో కరచాలనం చేయకపోవడం పెద్ద దుమారమే రేపింది. దాన్ని గుర్తు చేస్తూ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పటిలాగే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, నిర్ణయం భారత్ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.

News February 14, 2026

T20WC నుంచి ఒమన్ ఔట్

image

ఇవాళ ఐర్లాండ్‌ చేతిలో ఓటమితో T20WC-2026 నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా ఒమన్ నిలిచింది. గ్రూప్-Bలో ఉన్న ఆ జట్టు లీగ్ దశలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే గ్రూపులో శ్రీలంక, జింబాబ్వే ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాలతో 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అటు లీగ్ దశలో ఒమన్ తన చివరి మ్యాచ్‌ను FEB 20న ఆస్ట్రేలియాతో ఆడనుంది.