News April 19, 2025
ఎవరికి రూపాయి ఇవ్వనవసరం లేదు: వర్ధన్నపేట MLA

తెలంగాణ ప్రజలను కోటీశ్వరులుగా చూడాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ఆశయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ప్రజాపాలనలో ఏ అధికారి, నాయకుడికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా డబ్బులు అడిగితే 80961 07107కి ఫిర్యాదు చేయాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
Similar News
News April 19, 2025
కాజీపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేటలోని దర్గా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు భర్తతో విడాకులు కావడంతో మానసికంగా బాధపడింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది.
News April 19, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మహబూబాబాద్ ఎంపీ

వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారిని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం మహా మండపంలో వేదపండితులు, అర్చకులు అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి మహదాశీర్వచనం నిర్వహించి తీర్ధ ప్రసాదములు అందజేశారు.
News April 19, 2025
వరంగల్: ‘అత్తాన, పోతాన’.. ఇదే మన యాస, భాష

ప్రాంతాన్ని బట్టి భాష మాట్లాడే తీరు ఉంటుంది. WGL, KNR జిల్లాల్లో మాత్రం భాష కాస్త భిన్నంగా ఉంటుంది. KNR వారు అకారంతో మాట్లాడితే WGLలో ఒకారంతో మాట్లాడతారు. KNRలో వడ్లు అంటే WGLలో ఒడ్లు అంటాం. వేరే జిల్లాల్లో వస్తున్నా, వెళ్తున్నా అంటే మనం మాత్రం ‘అత్తాన, పోతాన’ అంటుంటాం. అచ్చిన, అట్లనా, అవ్వ, నాయిన, అప్పయ్య, జర ఆగు, షానా(చాలా), పైలం, బువ్వ అనే పదాలు వాడుతుంటాం. మీరెలా మాట్లాడుతారో కామెంట్ చేయండి.