News November 3, 2025
ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి..

పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు..
★ అందరిలోనూ దైవాన్ని చూడు. నువ్వు ఎవరికి నమస్కరించినా, అది చివరకు ఆ భగవంతుడికే చేరుతుంది
★ ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు
★ నామస్మరణ చేయండి, మీ నాలుక మధురం అవుతుంది, మీకు మంచి కలుగుతుంది
★ కేవలం అన్నం కోసం కాక, ధర్మం కోసం బతకండి.
Similar News
News November 3, 2025
మీర్జాగూడ యాక్సిడెంట్.. 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

బస్సు ప్రమాద ఘటనలో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం పోస్టుమార్టం చేశారు. 18 మృతదేహాలను వారి కుటుంబాలకు డాక్టర్లకు అప్పగించారు. టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ కాంబ్లీ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించి, అంబులెన్స్‌లో నాందేడ్‌కు తరలించారు.
News November 3, 2025
చిత్తూరు: 90% వైకల్యం ఉన్నా ‘నో పింఛన్’

ఐరాల (M) నెల్లిమందపల్లికి చెందిన నీరిగట్టి గౌతమ్ కుమార్ సోమవారం తమ తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ సుమిత్ కుమార్‌ను వికలాంగ పింఛను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ధ్రువీకరించిన 90% దివ్యాంగ సర్టిఫికెట్ కలిగి ఉన్నా.. ఇదివరకు పెన్షన్ మంజూరు కాలేదని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని కోరగా, పరిశీలించి పింఛను మంజూరు చేయాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.
News November 3, 2025
CII సమ్మిట్‌లో రూ.2లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు: మంత్రి లోకేశ్

AP: ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ‘సమ్మిట్‌కు 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. 410కి పైగా ఒప్పందాలు జరగనున్నాయి. వీటి విలువ రూ.2లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఈ ఒప్పందాల వల్ల 9లక్షల మందికి పైగా ఉద్యోగాలు పొందుతారు. స్వదేశీ పెట్టుబడుల సాధనలో ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది’ అని ప్రెస్‌మీట్‌లో వివరించారు.


