News April 24, 2024
ఎవరైనా దాడి చేస్తే నాకు చెప్పండి: సీఎం జగన్

వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపై ఎవరైనా దాడి చేస్తే తనకు చెప్పాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘అవతలి వారు మన మీద దాడి చేస్తే మనం విజయానికి చేరువలో ఉన్నామని.. అలాగే వారు విజయానికి దూరంలో ఉన్నట్లు భావించాలి’అని అన్నారు. ఈ సమావేశంలో భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
Similar News
News April 22, 2025
నేటి నుంచి విశాఖ రైల్వే స్టేడియంలో సమ్మర్ క్యాంప్

ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ రైల్వే స్టేడియంలో ఏప్రిల్ 22 నుంచి మే 31 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు డీఆర్ఎం లలిత్ బోహ్రా సోమవారం తెలిపారు. 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రతిరోజూ ఉదయం 12రకాల క్రీడలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లో విశాఖలో నివసించే వారు అర్హులని అన్నారు. పూర్తి వివరాలకు రైల్వే స్టేడియంలో సంప్రదించాలన్నారు.
News April 22, 2025
సింహాచలంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు

సింహాచలం వరహాలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏప్రిల్ 27న గంధం అమావాస్య వేడుకలు నిర్వహించనున్నట్లు ఈవో సుబ్బారావు సోమవారం తెలిపారు. ఈనెల 26 సాయంత్రం నుంచి భక్తులు కొండ కింద వరాహ పుష్కరిణి వద్ద జాగరము ఉండి స్నానమాచరించి స్వామి వారి దర్శనము చేసుకొని వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఏప్రిల్ 28 నుంచి మే2 వరకు ఆలయంలో తిరునక్షత్ర మహోత్సవము నిర్వహించనున్నారు. పైతేదీలలో అన్ని రకాల సేవలు రద్దు చేశారు.
News April 22, 2025
K.G.Hలో టీచర్లకు వైద్య శిబిరాలు

బదిలీల్లో ప్రాధాన్యత క్యాటగిరీ కిందకు వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 24 నుంచి 26 వరకు K.G.Hలో ప్రత్యేక వైద్య శిబిరానికి హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ కోరారు. 24న విశాఖ, 25న అనకాపల్లి, 26న అల్లూరి జిల్లాలకు చెందినవారు వైద్య శిబిరాలకు హాజరు కావాలన్నారు. ఈ శిబిరంలో పొందిన సర్టిఫికెట్ల ఆధారంగా కేటగిరీలను వర్గీకరిస్తామని తెలిపారు.