News April 4, 2024

ఎవిస్ హాస్పిట‌ల్స్ కొత్త శాఖ‌ల‌తో సేవ‌ల విస్త‌ర‌ణ

image

వాస్క్యుల‌ర్ రంగంలో దేశంలో నం.1 ఎవిస్ హాస్పిట‌ల్స్ త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రిస్తోంది. గురువారం కూక‌ట్‌ప‌ల్లిలో ఎవిస్ హాస్పిట‌ల్స్ నూత‌న శాఖ ప్రారంభించారు. MD, ప్ర‌ముఖ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్ డా.రాజా వి కొప్పాల పూజాదికాల‌తో కొత్త ఆసుప‌త్రికి అంకురార్ప‌ణ చేశారు. కార్యక్రమంలో డైరెక్ట‌ర్లు శ్రీ‌నివాస్, భ‌ర‌త్‌, వైభ‌వ్, డాక్ట‌ర్లు సంప‌త్, మ‌ల్లీశ్వ‌రి, బిందు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 20, 2026

RR: బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్స్‌కు అప్లై చేసుకోండి

image

PWDs సాధికారత, లబ్ధికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా మహిళలు, శిశువులు, దివ్యాంగులు & వృద్ధుల సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ మొదలైన సహాయ ఉపకరణాలను అందిస్తామన్నారు. జనవరి 21 నుంచి జనవరి 30వ తేదీలోపు OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు.

News January 20, 2026

HYDలో ఫేక్ ట్రాఫిక్ చలాన్ల కలకలం: జాగ్రత్త!

image

HYDలో నకిలీ ట్రాఫిక్ చలాన్ల మోసాలు పెరుగుతుండటంపై పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫిషింగ్ లింక్‌లను నిందితులు SMS ద్వారా పంపుతున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బాధితుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ సైట్లు ఎల్లప్పుడూ .gov.in లేదా .orgతో ముగుస్తాయని, SMS లింక్‌ల ద్వారా చెల్లింపులు చేయొద్దని అధికారులు సూచించారు.

News January 19, 2026

RR: సర్పంచ్‌లకు ముచ్చింతల్‌లో శిక్షణ

image

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు 5 విడతల్లో రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని 2 సమావేశ మందిరాలను సిద్ధం చేశారు.