News July 17, 2024

ఎస్ఈజెడ్‌లో అగ్ని ప్రమాదంపై హోంమంత్రి ఆరా

image

ఎస్ఈజెడ్‌లో జరిగిన <<13645446>>అగ్ని ప్రమాదంపై<<>> హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అగ్నిప్రమాద సంఘటనపై ఆరా తీశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్‌కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని ఆమె ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

Similar News

News April 5, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 5, 2026

విశాఖ: తొమ్మిదేళ్లలో మూడుసార్లు వార్డులు పెంపు(2/2)

image

రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీవీఎంసీలో గత తొమ్మిదేళ్లలో వార్డుల సంఖ్య పెంపు మూడోసారి చేపడుతున్నారు. 2017కి ముందు 72 వార్డులు ఉండగా, 2017లో 81కు, 2020లో పరిసర గ్రామాల విలీనంతో 98కు పెరిగాయి. ప్రస్తుతం 98 నుంచి 120కు పైగా పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం ముందుగా 8 జోన్లుగా ఉన్న జీవీఎంసీని ఇప్పటికే 10 జోన్లుగా విభజించారు.

News April 5, 2026

విశాఖ: గ్రేటర్‌లో వార్డుల పెంపు ప్రక్రియ వేగం(1/2)

image

జీవీఎంసీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగం అందుకుంది. ప్రస్తుతం ఉన్న 98 వార్డులను రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 120కు పైగా పెంచనున్నారు. 15 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో 120 వార్డులు తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం10 జోన్లుగా విస్తరించిన జీవీఎంసీ జనాభా 23-25 లక్షల వరకు చేరింది. రానున్న మున్సిపల్ ఎన్నికలు 120 వార్డుల ఆధారంగా నిర్వహించే అవకాశం ఉంది.