News November 12, 2025
ఎస్ఐఆర్‌పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

2002లో నమోదైన ఓటర్ల జాబితాను ప్రస్తుతం(2025) ఉన్న ఓటర్లతో పాటు వారి సంతానంలో ఉన్న ఓటర్లను ఎస్ఐఆర్‌లో సరిపోల్చడం జరుగుతుందని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్లో ఆర్డీవోలు/ఈఆర్వోలు, అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రానున్న రోజుల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై సమావేశం నిర్వహించారు.
Similar News
News November 12, 2025
VZM: నేడు PMAY గృహ ప్రవేశాలు

విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 8,793 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం జరగనుందని హౌసింగ్ పీడీ మురళీ తెలిపారు. బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయనున్నారు. రాజాం, నెల్లిమర్ల, బొబ్బిలి, ఎస్.కోట, చీపురుపల్లి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా గృహప్రవేశాలు జరుగనున్నాయి.
News November 12, 2025
పేషంట్ మృతికి కారణమంటూ ఉమర్‌పై వేటు

ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న డాక్టర్ <<18256986>>ఉమర్<<>> గురించి మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అనంత్‌నాగ్‌లోని ఆసుపత్రిలో ఉమర్ పనిచేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ పేషంట్ మృతికి కారణమయ్యాడని ప్రొఫెసర్ గులాం జీలాని తెలిపారు. షేషంట్ చావుబతుకుల్లో ఉంటే డ్యూటీ మధ్యలోనే వెళ్లిపోయాడని చెప్పారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఉమర్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
News November 12, 2025
నవంబర్ 12: చరిత్రలో ఈరోజు

1842: భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జాన్ స్ట్రట్ జననం
1885: కొప్పరపు సోదర కవుల్లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ జననం
1896: విఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ జననం
1925: నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి జననం
1946: భారత స్వాతంత్ర్య సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యా మరణం (ఫొటోలో)
1996: హరియాణాలో రెండు విమానాలు ఢీకొని 350 మంది మృతి


