News September 6, 2025
ఎస్‌కే యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్లేస్‌మెంట్ డ్రైవ్

ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాల సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈఫిల్ టెక్ సొల్యూషన్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించింది. 97 మంది విద్యార్థులు హాజరు కాగా, 65 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఈఫిల్ టెక్ సొల్యూషన్ డైరెక్టర్ కిశోర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 6, 2025
సీఎం చేతుల మీదుగా అరుణకు ఉత్తమ టీచర్ అవార్డు

పామిడిలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న యాదవ్ అరుణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును సీఎం చంద్రబాబు చేతుల మీదగా అందుకున్నారు. విజయవాడలో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్‌తో కలిసి అందుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఈ అవార్డు ఉపాధ్యాయ వృత్తిపై మరింత బాధ్యత పెంచిందన్నారు.
News September 5, 2025
ఉత్తమ టీచర్ అవార్డును అందుకున్న డాక్టర్ శారదా

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. విజయవాడలో శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అనంతపురం JNTU కెమికల్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శారదా ఉత్తమ టీచర్ అవార్డును అందుకున్నారు. ఈమె గతంలో JNTU ఇంజినీరింగ్ కళాశాలలోని కెమికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఈమె యూనివర్సిటీ NSS సెల్ కో-ఆర్డినేటర్‌గా ఉన్నారు.
News September 4, 2025
జిల్లా బెస్ట్ టీచర్ అవార్డుకు 76 మంది ఎంపిక

అనంతపురం జిల్లాలో బెస్ట్ టీచర్ అవార్డుకు 76 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబు తెలిపారు. టీచర్స్ డే సందర్భంగా వీరికి అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అవార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు శుక్రవారం ఉదయం 9 గంటలకు కళాశాలకు హాజరు కావాలన్నారు. ప్రతి ఏటా ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు.