News September 11, 2025

ఎస్జీఎఫ్ జోనల్ లెవెల్‌లో గర్రెపల్లి విద్యార్థుల సత్తా

image

సుల్తానాబాద్ ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో జరిగిన జోనల్ స్థాయి క్రీడల్లో గర్రెపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్-17 వాలీబాల్ బాలికల, బాలుర విభాగాల్లో, అలాగే అండర్-17 బాలికల కబడ్డీ విభాగంలో మొదటి స్థానాన్ని సాధించారు. అథ్లెటిక్స్‌లో రాణించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆసియా బేగంను అభినందించారు.

Similar News

News March 26, 2026

భద్రాచలంలో డీజీపీకి ఘనస్వాగతం

image

భద్రాచలంలో శుక్రవారం జరిగే శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర DGP శివధర్ రెడ్డికి SP రోహిత్ రాజు గురువారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల నుంచి DGP గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రామయ్య కళ్యాణ వేడుకల భద్రతా ఏర్పాట్లపై SPతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.

News March 26, 2026

HYD: యువతికి BAD మెసేజ్ చేసింది ఇతడే!

image

కొండాపూర్‌కు చెందిన యువతికి అసభ్యకర సందేశం పంపిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న SMలో ఆమె ఫిర్యాదు చేయగా కొండాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకొన్నట్లు బాధితురాలికి వాట్సాప్‌లో <<19475160>>లైవ్ ఫొటో<<>> పంపారు. కేవలం గంటల వ్యవధిలోనే అతడిని పట్టుకొన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని, వేధింపులకు పాల్పడితే కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని పోలీసులు హెచ్చరించారు.

News March 26, 2026

బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం: ఎస్పీ

image

యువత ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగులకు దూరంగా ఉండాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. జూదం వల్ల ఆర్థిక నష్టాలతో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత తమ విలువైన సమయాన్ని విద్య, ఉపాధి లక్ష్యాల కోసం కేటాయించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని, నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు.