News September 22, 2025
ఎస్టీయూ మెదక్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

ఎస్టీయూ టీఎస్ మెదక్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా రాజగోపాల్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా నరేశ్, ఆర్థిక కార్యదర్శిగా కిష్టయ్య, రాష్ట్ర కౌన్సిలర్లుగా శ్రీనివాస్, పోచయ్య, మహేందర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా కుమార్ శివప్రసాద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రవి, భూపతి గౌడ్, అశోక్, నర్సింలు, అరుణ్ కుమార్, రమేశ్ గౌడ్ ఎన్నికయ్యారు.
Similar News
News September 22, 2025
మెదక్ ప్రజావాణికి 13 ఫిర్యాదులు

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అర్జీదారుల నుంచి మొత్తం 13 దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
News September 22, 2025
మెదక్: వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్

మెదక్ కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించగా అదనపు కలెక్టర్ నగేష్ వినతులు స్వీకరించారు. అప్పాజిపల్లి గ్రామస్థులు పట్టాభూమి రోడ్డు విస్తరణలో ఇచ్చినందున పాత రోడ్డును వ్యవసాయం చేసుకోనేందుకు ప్రభుత్వ అధికారుల హామీ మేరకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. డీఆర్ఓ, సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులు ఉన్నారు.
News September 22, 2025
MDK: శరన్నవరాత్రులకు సిద్ధమైన ఏడుపాయల క్షేత్రం

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత ఆలయంలోని గోకుల్ షెడ్‌లో మండపాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం విశేష పూజలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొలిరోజు అమ్మవారికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఉదయం 10 గంటలకు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. తొలి రోజున బాలాత్రిపురసుందరి దేవి- శైలపుత్రీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు.