News September 23, 2025
ఎస్పీని కలిసిన కడప జిల్లా రాజకీయ నేతలు

ఇటీవల కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నచికేత్ విశ్వనాథ్‌ను జిల్లా రాజకీయ నేతలు మర్యాదపూర్వకంగా ఒకరి తర్వాత ఒకరు కలిశారు. వారంతా జిల్లాలో శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు రవీంధ్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేశ్ బాబు ఉన్నారు.
Similar News
News September 23, 2025
కడప: ‘అక్టోబర్ 2 నాటికి స్మార్ట్ కిచెన్లు సిద్ధం చేయాలి’

జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలలో అక్టోబర్ రెండు నాటికి స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి రావాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం JC అతిధి సింగ్‌తో కలిసి స్మార్ట్ కిచెన్ల భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష చేపట్టారు. స్మార్ట్ కిచెన్లు అన్ని మండలాల్లో ఓకే డిజైన్‌లో ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత నాణ్యతగా, రుచికరంగా అందించాలన్నారు.
News September 23, 2025
దసరా ఉత్సవాలకు రావాలని కడప ఎస్పీకి ఆహ్వానం

మైదుకూరులో 11 రోజులు అమ్మవారి దసరా ఉత్సవాలు జరగనున్నాయి. వీటికి హాజరు కావాలని కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్‌ను ఆర్యవైశ్య సభ కార్యవర్గ సభ్యులు కోరారు. ఈ మేరక ఆయనకు ఆహ్వాన పత్రికను అందించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ మైదుకూరు ఉపాధ్యక్షుడు దొంతు వెంకటసుబ్బయ్య, సెక్రటరీ అశోక్, జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఏలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News September 23, 2025
కడప జిల్లా డీఎస్సీ అభ్యర్థులకు గమనిక

కడప జిల్లాలో డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25వ తేదీ గురువారం విజయవాడలో నియామక పత్రాలు ఇవ్వనున్నారు. కడపలోని ఆర్ట్స్ కాలేజీ నుంచి విజయవాడకు బస్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులంతా బుధవారం ఉదయం 6 గంటలకు తమ గుర్తింపు కార్డుతో ఆర్ట్స్ కాలేజీ వద్దకు రావాలని డీఈవో శంషుద్దీన్ సూచించారు.