News August 13, 2024
ఎస్పీ నయీమ్ అస్మితో ఎమ్మెల్యే రాధాకృష్ణ భేటీ

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. భీమవరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తణుకు నియోజకవర్గంలోని శాంతిభద్రతలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలని కోరారు.
Similar News
News February 2, 2026
భీమవరం: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

భీమవరం రూరల్ మండలం రాయలం గ్రామ శివారులో ఆదివారం ఓ కారు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
News February 2, 2026
భీమవరం: అవినీతిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి

డ్వాక్రా సంఘాల నిధులు కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆకివీడుకు చెందిన మహిళలు, ఐద్వా నాయకులు సోమవారం కలెక్టర్ నాగరాణికి వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్‌లో వారు మొరపెట్టుకున్నారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఉదయకుమారి మాట్లాడుతూ.. బ్యాంకు అధికారుల అండతో 31 సంఘాలకు చెందిన సుమారు రూ.2,41,34,500 రూపాయలను గోల్‌మాల్ చేశారన్నారు.
News February 2, 2026
పశ్చిమ గోదావరికి బడ్జెట్ బూస్ట్

కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి పశ్చిమ గోదావరికి పలు కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్టుకు రూ.3,200 కోట్ల సాయం, జిల్లా ఆసుపత్రుల్లో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటుకు నిధులు దక్కాయి. కోకో, కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఏలూరు, భీమవరంలో బాలికల హాస్టళ్లు, నరసాపురం క్రోచెట్ లేస్ తయారు చేసే మహిళల కోసం ‘షి’ మార్కెట్లు రానున్నాయి.


