News January 31, 2025
ఎస్వీయూలో మరోసారి చిరుత కలకలం

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చిరుత కలకలం సృష్టిస్తున్నాయి. క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడి ఎత్తుకెళ్లిన చిరుతను విద్యార్థులు గమనించారు. గత నెలరోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. యూనివర్శిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్, హాస్టల్ సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు.
Similar News
News July 7, 2025
కొత్త రైల్వే లైన్లకు సిద్ధమవుతున్న DPRలు

TG: డోర్నకల్-గద్వాల, డోర్నకల్-మిర్యాలగూడ మధ్య కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి DPRలు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్టు నెలాఖరుకు ఇవి రైల్వే బోర్డుకు చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 2 లేన్ల నిర్మాణానికి రూ.7,460 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. డోర్నకల్-గద్వాల లైన్‌ను కాచిగూడ రైల్వే లైన్‌కు, డోర్నకల్-మిర్యాలగూడ రైల్వే లైన్‌ను గుంటూరు-BBనగర్ లైన్‌కు లింక్ చేస్తారు.
News July 7, 2025
ప్రతి తల్లి రెండు మొక్కలు పెంచాలి: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో ప్రతి తల్లి రెండు మొక్కలు నాటి పెంచాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. వనమహోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘పెద్దలు మనమే వనం.. వనమే మనం అన్నారు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలం. తల్లులు మొక్కలు నాటితే తమ పిల్లల్ని చూసుకున్నట్లే జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లలు కూడా తమ తల్లుల పేరిట మొక్కలు నాటాలి’ అని కోరారు.
News July 7, 2025
‘కాంతార చాప్టర్-1’ రిలీజ్ డేట్ వచ్చేసింది

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘కాంతార చాప్టర్-1’ సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 2022లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతోంది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.