News July 23, 2024

ఎస్సారెస్పీకి కొనసాగుతున్న వరద

image

నిజామాబాద్ జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 22 వేల ఇన్‌ఫ్లో క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1069 అడుగల నీటిమట్టం ఉంది.

Similar News

News September 15, 2025

అంగన్వాడీ భవన నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలి: NZB కలెక్టర్

image

అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం ఆయన మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపి మాట్లాడారు. జిల్లాలో 1,501 అంగన్వాడీ కేంద్రాలకు, 494 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయన్నారు. 610 అద్దె భవనాల్లో, మరో 397 కేంద్రాలు అద్దె చెల్లించే అవసరం లేకుండా వివిధ భవనాల్లో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

News September 15, 2025

నిజామాబాద్: ఈనెల 17న ప్రజాపాలన వేడుకలు

image

ఈ నెల 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో నిర్వహించే వేడుకలపై సోమవారం కలెక్టర్ చర్చించారు. వేడుకకు ముఖ్య అతిథిగా సWఎం సలహాదారు నరేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, పుర ప్రముకులు రానున్న నేపథ్యంలో లోటు పాట్లు లేకుండా చేయాలన్నారు.

News September 15, 2025

NZB: ప్రజావాణికి 23 ఫిర్యాదులు

image

నిజామాబాద్ సీపీ సాయి చైతన్య తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 23 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బాధితులు సీపీ కార్యాలయానికి వచ్చి వినతిపత్రాలు అందజేశారు. ఫిర్యాదుదారుల సమస్యలు విన్న సీపీ వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలకు ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలన్నారు.