News November 8, 2024
ఎస్సీ, ఎస్టీల ఉచిత డీఎస్సీ స్క్రీనింగ్ ఆన్‌లైన్ పరీక్ష వాయిదా

ఈనెల 10న జరగాల్సిన ఎస్సీ, ఎస్టీల ఉచిత డీఎస్సీ స్క్రీనింగ్ ఆన్‌లైన్ పరీక్ష వాయిదా వేసినట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వల్ల పరీక్ష వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. తదుపరి ఆర్డర్స్ వచ్చిన తరువాత పరీక్ష తేదీని తెలియజేస్తామన్నారు.
Similar News
News March 2, 2026
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ వేదికను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News March 1, 2026
గుత్తి: వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ ప్రారంభం

రైల్వే ఇన్స్టిట్యూట్లో అందరికీ ఉపయోగపడే విధంగా వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్‌ను ప్రారంభించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ కం ఏడీఎంఈ అశోక్ గౌడ్, సెక్రెటరీ నయాబ్ రసూల్ చాట్ బాట్ సర్వీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైల్వే ఇన్స్టిట్యూట్‌ను రిజర్వ్ చేసుకోవడానికి, రూమ్స్‌ను బుక్ చేసుకోవడానికి 9652793707 వాట్సాప్ నంబర్ ద్వారా చేసుకొనే అవకాశాన్ని కల్పించామన్నారు.
News February 28, 2026
అనంత: హాకీలో సత్తా చాటిన యువకుడు యువన్ క్రిష్

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంట్‌లో యువకుడు యువన్ క్రిష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న యువన్ క్రిష్ అండర్ 10 హాకీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. భవిష్యత్తులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పాఠశాల హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.


