News February 20, 2025
ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థల పరిశీలన

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించడానికి వివిధ మండలాలలో పరిశీలించిన భూ స్థలాల వివరాలను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం స్టేట్ ఫ్లాగ్ షిప్ స్కీమ్స్ కమిషనర్ శశాంకకు వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి గానూ జిల్లా అదనపు కలెక్టరు విజయేందర్ రెడ్డి మ్యాప్‌ల ద్వారా వివరాలను తెలియజేశారు.
Similar News
News November 14, 2025
నెల్లూరు: సైలెంట్ కిల్లర్‌కు చెక్ పెట్టేది ఎలా.?

మధుమేహ వ్యాధి గురించి జిల్లా వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. NOV 14 తేదీని ‘వరల్డ్ డయాబెటిస్ డే’ గా పాటిస్తున్న సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 6 లక్షల మందికి పైగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. సైలెంట్ కిల్లర్ అని చెప్పుకునే మధుమేహానికి సరైన జీవనశైలితో చెక్ పెట్టొచ్చని అంటారు.
News November 14, 2025
పోస్టల్ బ్యాలెట్: కాంగ్రెస్ ముందంజ

TG: జూబ్లీహిల్స్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈ ఉపఎన్నికలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. నవీన్ ఇందులో లీడింగ్‌లో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుండగా, ఎన్ని ఓట్లు అనేది కాసేపట్లో వెల్లడికానుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియగా ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత షేక్‌పేట డివిజన్ ఓట్లను కౌంట్ చేస్తున్నారు.
News November 14, 2025
GNT: హాస్టల్ విద్యార్థిని బ్యాగ్‌లో మంగళసూత్రం.?

హాస్టల్ విద్యార్థిని బ్యాగ్‌లో గర్భనిర్ధారణ పరిక్ష పరికరం, మంగళసూత్రం వెలుగుచూడటం గుంటూరులో చర్చనీయాంశమైంది. నగరంపాలెం పరివర్తన భవన్ ఎస్సీ బాలికల వసతిగృహం సిబ్బంది విద్యార్థినుల బ్యాగులు తనిఖీ చేసే క్రమంలో ఆ వస్తువులు బయటపడ్డాయి. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.? కలెక్టర్ తమీమ్ అన్సారియా గత రాత్రి హాస్టల్ ఆకస్మిక తనిఖీ కూడా ఇందుకు కారణమేనని తెలస్తోంది.


