News December 31, 2025
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై మంత్రి అడ్లూరి సమీక్ష

భూపాలపల్లి కేంద్రంగా హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అభివృద్ధి పనులపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్షా సమావేశం ప్రారంభించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణ రావుతో కలిసి మంత్రి పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నారు. గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు, వసతులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రిన్సిపాల్‌లతో చర్చిస్తున్నారు.
Similar News
News January 10, 2026
ఈ పథకం కింద ఏ పరికరాలను అందిస్తారు?

వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించి, యాంత్రీకరణను ప్రోత్సహించి అధిక దిగుబడులను సాధించడమే వ్యవసాయ యాంత్రీకరణ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే రైతులు సాగులో ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పవర్ టిల్లర్లు, గడ్డి కట్టలు కట్టే యంత్రాలు, రోటావేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్లను ప్రభుత్వం రాయితీగా అందించనుంది. దీని వల్ల పంట నాట్లు, కోత సమయంలో కూలీల కొరత, ఖర్చు తగ్గి రైతులకు ఎంతో లబ్ధి కలగనుంది.
News January 10, 2026
ప్రకాశంలో నేడు, రేపు వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పొగమంచు అధికంగా కురుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షసూచన ఉన్నట్లు ప్రకటన వెలువడింది.
News January 10, 2026
కొయ్యూరు: గమనిక.. 3 రోజులు హైవే రహదారి మూసివేత

కొయ్యూరు మండలంలోని వలసంపేట జాతీయ రహదారిపై అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. చింతపల్లి నుంచి కేడీపేట జాతీయ రహదారి మద్యలో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు నిమిత్తం శుక్రవారం నుంచి బుధవారం వరకు వాహన రాకపోకలు నిలిపివేస్తున్నామని హైవే అధికారులు తెలిపారు. ఇటుగా ప్రయాణించే వాహన దారులు గమనించాలని కోరారు


