News January 1, 2025
ఎస్సీ కులగణనపై అభ్యంతరాల స్వీకరణ గడువు పొడిగింపు
ఎస్సీ కుల గణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అనంతపురం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియడంతో మరో వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
Similar News
News January 4, 2025
అనంతపురంలో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్!
అనంతపురంలోని ARTS కళాశాల మైదానంలో జనవరి 9న హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ మేరకు మేకర్స్ నిర్ణయించినట్లు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఇక సీమ గడ్డపై డాకు మహారాజ్ సందడి చేయనుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News January 4, 2025
కబళించిన మృత్యువు!
ఊర్లో దేవర. కొత్త దుస్తుల కోసం ఆ దంపతులు అనంతపురం జిల్లా యాడికి వెళ్లారు. సంతోషంగా తిరుగుపయణం అవగా వారి బైక్‌ను బొలెరో ఢీకొంది. ఈ విషాద ఘటనలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్ (38), సుమలత (35) మరణించారు. కొత్త దుస్తుల కోసం పాఠశాల నుంచి హుషారుగా ఇంటికి వచ్చిన పిల్లలు పూజిత, మిథిల్ తల్లిదండ్రుల శవాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో ఇద్దరు చిన్నారులూ అనాథలయ్యారు.
News January 4, 2025
తోపుదుర్తి చందశేఖర్ రెడ్డిపై ఎస్పీకి ఫిర్యాదు
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చందశేఖర్ రెడ్డిపై టీడీపీ నేతలు పరశురామ్, విజయకుమార్ జిల్లా ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో చంద్రబాబు, నారా లోకేశ్‌ను దూషిస్తూ వ్యక్తిగతంగా దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆ రోజే అనుకొని ఉండుంటే మొద్దు శ్రీనుతో లోకేశ్‌ని చంపించేవాడని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని తెలిపారు.