News January 8, 2025

ఎస్సీ కులగణనపై 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ: కలెక్టర్

image

ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కుల గణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వివరాలను ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా 16వ తేదీ వరకు అధికారులు నమోదు చేస్తారని, అన్ని తనిఖీలు పూర్తిచేసి ఈనెల 20న వివరాలను విడుదల చేస్తారన్నారు.

Similar News

News January 8, 2025

ఒకే చోట జేసీ బ్రదర్స్

image

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకే చోట కనిపించారు. తాడిపత్రిలో జరుగుతున్న క్రికెట్ పోటీలను వారు తిలకించారు. ప్లేయర్లును ఉత్సాహపరిచారు. చాలా రోజుల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకచోట కనిపించడంపై వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.

News January 8, 2025

అనంతపురం జిల్లాలో ప్రధాని మోదీ చేతుల మీదుగా..

image

విశాఖ వేదికగా జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. వివరాలు ఇలా..
☛ రూ.160 కోట్లతో తాడిపత్రి బైపాస్‌ 4 వరుసల విస్తరణకు శంకుస్థాపన
☛ రూ.352 కోట్లతో గుత్తి-పెండేకల్లు రైల్వే డబ్లింగ్‌ పనులకు శంకుస్థాపన
☛ మడకశిర-సిర, ముదిగుబ్బ బైపాస్‌, బత్తలపల్లి-ముదిగుబ్బ నాలుగు వరుసల రహదారి ప్రారంభోత్సవం
☛ రూ.998 కోట్ల నిర్మించిన గుత్తి-ధర్మవరం రైల్వే లైన్‌ ప్రారంభోత్సవం

News January 8, 2025

అనంతపురం పోలీస్ గ్రౌండ్స్‌లో ‘డాకు’ ప్రీ రిలీజ్ ఈవెంట్

image

అనంతపురంలో రేపు జరగనున్న ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది. తొలుత ARTS కళాశాల మైదానంలో ఈవెంట్ ప్లాన్ చేయగా తాజాగా పోలీస్ గ్రౌండ్స్‌కు మార్చారు. దీంతో నిర్మాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. హీరో బాలకృష్ణ, కథానాయికలు ప్రగ్యాజైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, గ్లామర్ రోల్‌లో కనిపించిన ఊర్వశి రౌతేలా, దర్శకుడు బాబీ అనంతకు తరలిరానున్నారు. మంత్రి నారా లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు.